Sri Lanka Protests : టూరిస్ట్ స్పాట్‌గా మారిన లంక అధ్యక్ష భవనం

Sri Lanka Protests : వేల మంది అధ్యక్ష భవనంలోకి వెల్లి అక్కడ తమకు నచ్చిన విధంగా ఉల్లాసంగా గడుపుతూ ఫోటోలు దిగారు.;

Update: 2022-07-11 14:44 GMT

Sri Lanka Crisis : శ్రీలంకలోని అధ్యక్ష నివాసాన్ని రెండు రోజుల క్రితం ఆందోళనకారులు ముట్టడించి లోపలికి ప్రవేశించిన విషయం తెలిసిందే. వేల మంది అధ్యక్ష భవనంలోకి వెల్లి అక్కడ తమకు నచ్చిన విధంగా ఉల్లాసంగా గడుపుతూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

శ్రీలంక అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్‌లో వందల మంది ఆందోళనకారులు స్విమ్ చేస్తూ ఉన్న వీడియో ఇప్పటికే తెగ వైరల్ అయిపోయింది. గోటబయ రాజపక్స రాజీనామా శ్రీలంక వదిలివెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

శ్రీలంక అధ్యక్ష భవనంలోని లక్జరీని, వసతులను చూసి ఆందోళనకారులు ఆశ్చర్యానికి గురౌతున్నారు. శ్రీలంక ప్రజలు బతకడానికే అష్టకష్టాలు పడుతుంటే అధ్యక్షుడు విలాసాల్లో మునిగి తేలాడని అనుకుంటున్నారు. కొంత మందికి ఆందోళనకారులకు అదో పిక్నిక్ స్పాట్‌గా మారింది.

భవనంలోని వంట గదికి వెళ్లి అక్కడున్నవాటితో వంటవండుతూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు అధ్యక్షుడి కుర్చిలో కూర్చొని సెల్ఫీలకు పోజ్ ఇస్తున్నారు. అయితే అధ్యక్షుడి భవనంలోకి వెళ్లినా శ్రుతిమించిన ఆందోళనలను విద్వంసాలకు మాత్రం పాల్పడలేదు లంక ప్రజలు.


Tags:    

Similar News