Maldives : రాజపక్సకు మాల్దీవుల్లో కూడా నిరసన సెగ..
Maldives : శ్రీలంక నిరసన సెగలు మాల్దీవులను తాకింది. మాల్దీవుల అధ్యక్షుడి ఇంటి వద్ద లంకేయులు ఆందోళన చేపట్టారు.;
Maldives : శ్రీలంక నిరసన సెగలు మాల్దీవులను తాకింది. మాల్దీవుల అధ్యక్షుడి ఇంటి వద్ద లంకేయులు ఆందోళన చేపట్టారు. దాంతో మాల్దీవుల పోలీసులు వారిని అడ్డుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను తమ దేశానికి పంపించాలని డిమాండ్ చేశారు.
అయితే లంకేయుల నిరసనలతో గొటబాయ రాజపక్స మాల్దీవులను విడిచి వెళ్లారు. కుటుంబంతో కలిసి గొటబాయ సింగపూర్ లేదా దుబాయ్‌కి పారిపోయినట్లు తెలుస్తోంది.