Ukraine Russia: వేలాదిమంది ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా..?
Ukraine Russia: రాజధాని కివ్ నగరాన్ని హస్తగతంచేసుకోవడంలో భాగంగా.. దాడులను తీవ్రతరం చేసింది.;
Ukraine Russia: ఉక్రెయిన్‌పై రష్యాభీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కివ్ నగరాన్ని హస్తగతంచేసుకోవడంలో భాగంగా.. దాడులను తీవ్రతరం చేసింది. అయితే పోర్టు నరగమైన మేరియు పోల్ నగరంపై క్షిపణిదాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా ఈ నగరానికి ఆహారం,తాగునీరు, ఇంధనం సరఫరానిలిచిపోయింది. రెండువేలమందికిపైగా చిన్నారులకు రష్యా కిడ్నాప్ చేసిందన్న ఉక్రెయిన్ వాదనను రష్యా కొట్టిపారేసింది. పరిస్థితి చేయిదాటి పోవడంతో నాటోదేశాలు అప్రమత్తమై ఆయుధాలను సిద్ధంచేస్తున్నాయి.