London: లండన్‌లోని రెస్టారెంట్‌లో దారుణం.. పట్టపగలే అమ్మాయిని కత్తితో పొడిచి..
London: లండన్ బార్కింగ్ రోడ్‌లోని ఈస్ట్ హోమ్ రెస్టారెంట్‌లో దారుణం చోటుచేసుకుంది.;
London: లండన్ బార్కింగ్ రోడ్‌లోని ఈస్ట్ హోమ్ రెస్టారెంట్‌లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అమ్మాయిని ఓ వ్యక్తి కిరాతకంగా కత్తితో పొడిచాడు. అమ్మాయిని కత్తితో పొడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మధ్యాహ్నం 2.22 గంటలకు ఈ సంఘటన జరిగింది. నిందితుడిని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేయగా.. గాయపడిన అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు.
లండన్‌లోని బార్కింగ్ రోడ్‌లో ఇండియన్ రెస్టారెంట్ హైదరాబాద్ వాలాలో జరిగిన ఈ హత్య ఉదంతం కలకలం రేపింది. అప్పటికే రెస్టారెంట్‌లో సదరు నిందితుడు టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేస్తున్నాడు. బయటి నుంచి వచ్చిన అమ్మాయి ఆ వ్యక్తి వద్దకు వెళ్లింది. అమ్మాయితో మాట్లాడిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మాయి ప్రతిఘటించినా ప్రయోజనం లేకుండాపోయింది.
ఆ అమ్మాయిని కిందపడేసి కత్తిపోట్లు పొడిచాడు ఆ నిందితుడు. అడ్డు వచ్చిన వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి హైదరాబాద్‌కు చెందిన సోనిగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం లండన్ లో ఉంటున్న ఆమె.. పార్ట్‌టైం జాబ్‌గా రెస్టారెంట్‌లో పని చేస్తోంది.