ఏపీఎస్ఎస్‌డీసీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.;
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ప్రైవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. తాజాగా టోల్‌ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఇందులో మొత్తం 150 ఖాళీలున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో చూడొచ్చు.
ముఖ్య సమాచారం
మొత్తం ఖాళీలు: 150
జాబ్ లొకేషన్: హైదరాబాద్, బెంగళూరు
విద్యార్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారు దరఖాస్తుకు అనర్హులు. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
జీతం: హైదరాబాద్‌లో నెలకు రూ.15,000.. బెంగళూరులో నెలకు రూ.17,000 ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2020
వెబ్‌సైట్: https://www.apssdc.in/