CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000
CBI Recruitment 2022: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) “కన్సల్టెంట్స్” పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టుకు నెలవారీ వేతనం నెలకు రూ. 40,000.;
CBI Recruitment 2022: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) "కన్సల్టెంట్స్" పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టుకు నెలవారీ వేతనం నెలకు రూ. 40,000.
కన్సల్టెంట్‌గా నియమించుకోవడానికి ఇన్‌స్పెక్టర్ స్థాయి అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారుల కోసం CBI వెతుకుతోంది.
ఇన్‌స్పెక్టర్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న సెంట్రల్/స్టేట్ పోలీస్ ఫోర్సెస్‌లో రిటైర్డ్ ఆఫీసర్లు, కోర్టు ఆఫ్ లాలో క్రిమినల్ కేసుల విచారణ మరియు ప్రాసిక్యూషన్‌లో 10 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
అభ్యర్థులకు ఆంగ్లం రాయడంలో మంచి పరిజ్ఞానం ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలతో పాటు, జాయింట్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ జోన్, CBI, చండీగఢ్ జోన్, సెక్టార్ 30 A, చండీగఢ్‌కు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు . దరఖాస్తుకు ఆఖరు తేదీ మే 31, 2022.