Group C posts in Railways: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రైల్వేలో గ్రూప్ సి పోస్టులు.. పరీక్ష లేకుండానే ఎంపిక

Group C posts in Railways: గ్రూప్ సి పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Update: 2022-02-21 04:55 GMT

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) కింద గ్రూప్ సి పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తు తేదీ - 19 ఫిబ్రవరి 2022

దరఖాస్తుకు చివరి తేదీ- 5 మార్చి 2022

గ్రూప్ సి పోస్టుల సంఖ్య - 21 పోస్టులు

విద్యార్హత:-

స్థాయి 2/3: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో ITI చేసి ఉండాలి. అలాగే, నోటిఫికేషన్‌లో ఇచ్చిన క్రీడా అర్హతలు ఉండాలి.

స్థాయి 4: సైన్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, నోటిఫికేషన్‌లో ఇచ్చిన క్రీడా అర్హతలు ఉండాలి.

స్థాయి-5: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే, నోటిఫికేషన్‌లో ఇచ్చిన క్రీడా అర్హతలు ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ. 500/-

SC/ST షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ, మహిళలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (BBC) – రూ. 150/-

Tags:    

Similar News