Income Tax Department Recruitment 2022: టెన్త్, డిగ్రీ అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. 20,200 - 34,800

Income Tax Department Recruitment 2022: టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2022-03-22 04:45 GMT

Income Tax Department Recruitment 2022: టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను 18 ఏప్రిల్ 2022 లోపు పంపాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ ప్రాంతంలో పోస్టింగ్ ఉంటుంది.

బోర్డు పేరు: ఆదాయపు పన్ను శాఖ

పోస్టుల పేరు: ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్

ఖాళీల సంఖ్య: 24

అధికారిక వెబ్‌సైట్: www.incometaxindia.gov.in

అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్ (పోస్ట్ ద్వారా)

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022

ఖాళీ వివరాలు

మొత్తం – 24

టాక్స్ అసిస్టెంట్ - 05

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 18

ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్-1

అర్హతలు:

టాక్స్ అసిస్టెంట్లు & ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ కోసం: (i) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమానం (ii) గంటకు 8,000 పదాలు టైప్ చేయగలిగి ఉండడం.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం: (i) గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం

వయో పరిమితి:

కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ:

వ్రాత పరీక్ష

షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు

క్రీడాకారులు గ్రౌండ్/ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది

జీతం..:

ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్ రూ. 9,300 – 34,800/-

టాక్స్ అసిస్టెంట్ రూ. 5,200 – 20,200/-

దరఖాస్తు విధానం..

వెబ్ సైట్ లో పేర్కొన్న ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి. అవసరమైన అన్ని వివరాలను పూరించాలి. అవసరమైన పత్రాల కాపీలను జత చేయాలి.

చివరగా, దరఖాస్తు ఫారమ్‌ను క్రింది పోస్టల్ చిరునామాకు సమర్పించండి.

చిరునామా:

ఆదాయపు పన్ను అదనపు కమిషనర్,

ప్రధాన కార్యాలయం (పర్సనల్ & ఎస్టాబ్లిష్‌మెంట్),

ఈస్ట్ ఫ్లోర్, రూమ్ నం. 14,

అయకార్ భవన్, P-7, చౌరింగ్‌గీ

స్క్వేర్, కోల్‌కతా- 700069


Tags:    

Similar News