Amazon Jobs: డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు.. ఇంటి నుంచే పని.. ఏడాదికి రూ.4 లక్షల జీతం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఉద్యోగ నియామకాల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.;
Amazon Jobs: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఉద్యోగ నియామకాల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అప్తై చేసుకునేందుకు అర్హులు. దాదాపు 5వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉన్నవారికి ఇది మంచి అవకాశం. దరఖాస్తు చేసుకునేందుకు లింక్‌పై క్లిక్ చేయాలి.
ఉద్యోగ వివరాలు:
పోస్టు పేరు: సెల్లర్ సపోర్ట్ అసోసియేట్
విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
జీతం: ఏడాదికి రూ.2,75,000 నుంచి రూ.4,00,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థి తన పూర్తి వివరాలతో అప్లికేషన్‌ను ఫిల్ చేయాలి. అనంతరం దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని ధృవీకరిస్తూ మీకు ఒక మెయిల్ వస్తుంది. మీ అప్లికేషన్‌ను పరిశీలించిన సంస్థ ఆన్‌లైన్ పరీక్షకు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
పరీక్ష విధానం:
ఆన్‌లైన్‌లోనే పరీక్షను నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. రెండు, మూడు రౌండ్లు ఇంటర్వ్యూ చేస్తారు. ఎంపికైన అభ్యర్దులను నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుంచే పనిచేయొచ్చు.