Narendra Modi : ఫిబ్రవరి 5న తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ
Narendra Modi : ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రాబోతున్నారు. రామానుజాచర్య సహస్రాబ్ధి వేడుకలకు ఆయన హాజరుకాబోతున్నారు.;
Narendra Modi : ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రాబోతున్నారు. రామానుజాచర్య సహస్రాబ్ధి వేడుకలకు ఆయన హాజరుకాబోతున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్ మండలం మచ్చింతల్లో ఏర్పాటు చేసిన రామానుజచార్య విగ్రహ ఆవిష్కరణలో మోదీ పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దివ్య సాకేతానికి ప్రత్యేక రోడ్డు నిర్మిస్తున్నారు. విమానం ల్యాండ్ అవగానే రన్‌వే నుంచి నేరుగా... మచ్చింతల్ చిన జీయర్ స్వామి ఆశ్రమానికి చేరేలా విశాల రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఎయిర్‌పోర్టు ప్రహారీ గోడను కూడా కూల్చేశారు. రోడ్డు నిర్మాణం కోసం 6కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటు దివ్య సాకేతానికి సమీపంలో 3 హెలిప్యాడ్‌లు కూడా నిర్మించారు. SPG అధికారులు పరిశీలించాకే, ఎయిర్‌పోర్టు నుంచి మోదీ రోడ్డు మార్గంలో వస్తారా... లేదా హెలికాప్టర్ ద్వారా దివ్వ సాకేతానికి చేరుతారా అనే దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు అధికారులు.