NTPC Recruitment 2022 : పది అర్హతతో NTPCలో ఉద్యోగాలు.. జీతం రూ. 40,000

NTPC Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఝార్ఖండ్ లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.;

Update: 2022-03-05 04:56 GMT

NTPC Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఝార్ఖండ్ లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఈ నోటిఫికేషన్ ద్వారా 177 పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 15 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://careers.ntpc.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 177

మైనింగ్ ఓవర్‌మెన్: 74

అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000 జీతంగా చెల్లిస్తారు.

మైనింగ్ సర్థార్: 103 పోస్టులు

అర్హతలు: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 57 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,000

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని స్కిల్ టెస్టుకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://careers.ntpc.in/


Tags:    

Similar News