Sainik School Recruitment 2022: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో సైనిక్ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.44,900
Sainik School Recruitment 2022: సైనిక్ స్కూల్ చంద్రాపూర్‌లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. TGT, PGT తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.;
Sainik School Recruitment 2022: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సైనిక్ స్కూల్ చంద్రాపూర్ అధికారిక వెబ్‌సైట్ sainikschoolchandrapur.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 28ని ఆఖరు తేదీగా నిర్ణయించారు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్ధులు TGT,PGT చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్ చేసిన అభ్యర్ధులు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
జీతం: TGT హిందీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నారు. PGT ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.47,600, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.25,000 చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు ఉచిత వసతి సదుపాయంతో పాటు, ఇద్దరు పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తారు.
ఖాళీల వివరాలు..
TGT హిందీ 1
PGT ఇంగ్లీష్ 1
PGT ఫిజిక్ 1
PGT కెమిస్ట్రీ 1
PGT మ్యాథ్స్ 1
PGT బయోలజీ 1
PGT కంప్యూటర్ సైన్స్ 1
ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ 1
ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ 1
ల్యాబ్ అసిస్టెంట్ బయోలజీ 1
Sainik School Recruitment 2022: ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో సైనిక్ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.44,900
Sainik School Recruitment 2022: సైనిక్ స్కూల్ చంద్రాపూర్‌లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. TGT, PGT తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.sainikschoolchandrapur.com ను ఓపెన్ చేయాలి.
* అనంతరం హోం పేజీలో కనిపించే Staff Recruitment Notification (PGT) dated 05.02.2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
' అనంతరం apply online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* అనంతరం 6 దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
* పూర్తి వివరాలను పొందుపరిచి అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.