10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Update: 2021-02-06 06:48 GMT

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎన్ఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి అర్హతతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 21 దరఖాస్తుకు ఆఖరు తేదీ. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈసారి కూడా దాదాపు అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

ముఖ్య సమాచారం..

ఖాళీలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 05,2021,

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 21, 2021.

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మార్చి 23, 2021.

ఫైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మార్చి 29, 2021.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1): 01.07.2021 నుంచి 20.07.2021 వరకు.

టైర్-2 పరీక్ష తేదీ (డిస్కిప్ట్రివ్ పేపర్): నవంబర్ 21, 2021.

వెబ్‌సైట్ : https://ssc.nic.in/

Tags:    

Similar News