Vizag Steel Recruitment 2022: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.39,000

Vizag Steel Recruitment 2022: మైన్ ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ వంటి 5 పోస్టులకు అభ్యర్ధుల్ని ఆహ్వానిస్తోంది.;

Update: 2022-01-27 05:22 GMT

Vizag Steel Recruitment 2022: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీని వైజాగ్ స్టీల్ అని కూడా పిలుస్తారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉన్న లైమ్‌స్టోమ్ మైన్స్‌లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మైన్ ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ వంటి 5 పోస్టులకు అభ్యర్ధుల్ని ఆహ్వానిస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్ధులకు విశాఖపట్నంలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 26న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు: 5

మైన్ ఫోర్‌మ్యాన్ : 1..

అర్హత: డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ పాస్ కావడంతో పాటు మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికెట్ ఉండాలి. మెకనైజ్డ్ ఓపెన్ ‌క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.

వయసు: 35 ఏళ్ల లోపు

జీతం: నెలకు రూ.39,000+రూ.1,750 హెచ్‌ఆర్‌ఏ

మైనింగ్ మేట్: 4

అర్హత: ఎస్ఎస్‌సీ లేదా మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. మెకనైజ్డ్ ఓపెన్‌క్యాస్ట్ ముటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000+రూ.1,680 హెచ్‌ఆర్‌ఏ

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 ఫిబ్రవరి 9

అభ్యర్ధులకు అనుభవం తప్పనిసరి

ఎస్సీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు https://www.vizagsteel.com/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

సంబంధిత పోస్టులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది.

ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

మొదటి దశలో అభ్యర్ధి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

రెండో దశలో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్‌మిట్ చేయాలి.

Tags:    

Similar News