అలా చేయకపోతే 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాలి: గులాం నబీ ఆజాద్

Update: 2020-08-28 04:17 GMT

ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుని నియమించాలని గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. నేరుగా నియమిస్తే.. అధ్యక్షుడికి పార్టీలో ఒకశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరిగితేనే పార్టీ బాగుపడుతుందనీ.. అలా జరగకపోతే.. పార్టీ 50 ఏళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీడబ్ల్యూ సహా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని పదవులకు కూడా ఎన్నికలు జరగాల్సిందేనని స్ఫష్టం చేశారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారంతా తాము ఓడిపోతామని భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  

Tags:    

Similar News