హర్యానా వ్యవసాయ మంత్రికి కరోనా పాజిటివ్
హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. మంత్రి జేపీ దలాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.;
హర్యానాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో సామన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. మంత్రి జేపీ దలాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని బుధవారం ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకినందున తాను ఇంట్లోనే రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని జేపీ దలాల్ తెలిపారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
కాగా, హర్యానా సీఎం మనోహర్‌లాల్ కట్టర్, స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా, రవాణామంత్రి మూల్‌చంద్ శర్మ కరోనా బారిన పడ్డారు. తాజాగా దలాల్‌తో కలిపి హర్యానాలో కరోనా బారినపడ్డ అధికార బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.