దేశంలో ఒక్కరోజే కరోనాతో 1023 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనాతో ఒక్కరోజే 1023 మంది ప్రాణాలు కోల్పోయారు.;
దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 33 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75,760 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 7,25,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారి నుంచి కోలుకుని 25,23,772 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనాతో ఒక్కరోజే 1023 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాలు 60,472కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.