బెయిల్‌పై బయటికి వచ్చి అత్తను హతమార్చిన అల్లుడు
బెయిల్‌పై బయటికి వచ్చి అత్తను దారుణంగా హతమార్చాడు అల్లుడు. సొంత మేనల్లుడే అత్తను పొలంలో తుపాకీతో కాల్చి చంపాడు.;
బెయిల్‌పై బయటికి వచ్చి అత్తను దారుణంగా కాల్చి చంపాడు అల్లుడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇడుక్కి జిల్లాలోని ఓ గిరిజన మహిళ తన సొంత మేనల్లుడి చేతిలో హత్యకు గురైంది. చంద్రిక అనే 34 ఏళ్ల మహిళ పాలపెట్టి పట్టణానికి సమీప గ్రామంలో నివాసం ఉంటుంది. అయితే శుక్రవారం సొంత మేనల్లుడే ఆమెను పొలంలో తుపాకీతో కాల్చి చంపాడు. 19 ఏళ్ల మేనల్లుడు మరో ఇద్దరితో కలిసి అత్తను హతమార్చాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. శుక్రవారం రాత్రి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి గందపు చెక్కల స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రెండు వారాల క్రితం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన మేనత్త ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతను బెయిల్‌పై బయటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్తపై కక్ష పెంచుకున్న అల్లుడు.. ఆమెను హత మార్చినట్లు పోలీసులు బావిస్తున్నారు.