ఇప్పుడు అంతటా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా వార్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఇరాన్ మీద భీకర దాడులు చేస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. మొదటి దాడిలోనే సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాయి ఆ రెండు దేశాలు. అయితే ఇరాన్ మొదటి నుంచి ఇండియాకు మిత్ర దేశం. ఎన్నో విషయాల్లో ఇండియాకు ఇరాన్ సాయం చేసింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై స్పందించాలని మోడీని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మన దేశానికి ఎన్నో విధాలుగా సాయం చేసిన ఇరాన్ దేశం మీద ఇలాంటి దాడులను ఖండించకుండా ఉండటం ఏంటని మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ యుద్ధం మీద మోడీ రీసెంట్ గా స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు అవసరమని తెలిపారు.
భారత్ శాంతి మాత్రమే కోరుకుంటుందని.. ఎవరితోనూ యుద్ధానికి దిగబోదని తెలిపారు. అంతే తప్ప ఎవరినీ తప్పుబట్టలేదు. కాగా ఇలా స్పందించడం కరెక్ట్ కాదంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. తటస్థంగా ఉండటం స్పందించినట్టు కాదని.. ఏదో ఒకటి చెప్పాలని అడుగుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. యుద్ధంలో మనం ఎటువైపు అనేది తేల్చాలని అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. రీసెంట్ గానే మోడీ ఇజ్రాయెల్ వెళ్లి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతే యుద్ధం స్టార్ట్ అయింది.
కానీ ఇప్పటి వరకు ప్రధాని మోడీ మాత్రం ఎవరివైపు మాట్లాడలేదు. కాకపోతే ఆ దేశాల అధినేతలతో ఫోన్లు మాట్లాడి అక్కడున్న భారతీయుల భద్రత గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండియన్ల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లొద్దని కోరారు ప్రధాని. అయితే యుద్ధం ఎఫెక్ట్ ఇండియాపై కూడా బలంగానే ఉంటుందిన అంటున్నారు విశ్లేషకులు. చమురు ధరలతో పాటు ఇతర నిత్యవసర సరుకుల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.