ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఈ ఏడాది చివరినాటికి.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.;
దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్న నిత్యం కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలంటే.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ రావలి. ప్రపంచ దేశాలంతా కరోనాకు విరుగుడు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చివరినాటికి.. దేశంలో తయారుచేస్తున్న మొదటి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎన్డీఆర్ఎఫ్ హాస్పిటల్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయంగా తయారవుతున్న ఓ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మూడో ఫేజ్‌లో ఉన్నదని తెలిపారు. అది ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు.