'మను' లో రెగ్యులర్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు.. నేడే చివరి తేది
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) లో రెగ్యులర్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.;
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) లో రెగ్యులర్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారిత రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ ఆగస్టు 24. ఈ మేరకు 'మను' ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను సెప్టెంబర్ 30న ప్రకటించనున్నారు.
బి.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎం.ఎడ్, డి.ఎల్.ఎడ్, పాలిటెక్నిక్ డిప్లొమా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం ప్రవేశాలు జరుగుతున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ manuu.edu.in ని సందర్శించవచ్చని 'మను' వెల్లడించింది. ఏవైనా సందేహాలు ఉంటే admissionsregular@manuu.edu.in కు పంపవచ్చని తెలిపింది.
పాలిటెక్నిక్ డిప్లొమాలో ఇంజనీరింగ్‌లో సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఉన్నట్లు 'మను' పేర్కొంది. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, అరబిక్, పర్షియన్ భాషల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు 'మను' పేర్కొంది.