భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ముష్కరులు హతం
ఐదుగురు సాయుధ పాకిస్థాన్ చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు.;
భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఐదుగురు సాయుధ పాకిస్థాన్ చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ ఘటన ద్రాల్ సరిహద్దు పోస్ట్ సమీపంలో చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారత భూభాగంలోకి ఐదుగురు ముష్కరులు చొరబడ్డారు. దీంతో చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. చొరబాటుదారుల నుంచి 9.92 కిలోల హెరాయిన్, ఒక ఏకే-47 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 27 రౌండ్ల బుల్లెట్లు, నాలుగు 9ఎంఎం బెర్రెట్ట పిస్టళ్లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.610 పాక్ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఇంతమంది పాక్ జాతీయులు భారత్‌లోకి చొరబడటం ఇదే తొలిసారి అని బీఎస్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.