మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
పుదుచ్చేరిలోని డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఒర్లీన్ పేట ఎమ్మెల్యే, డీఎంకే పార్టీ నేత అయిన శివకు కరోనా సోకింది.;
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇక పుదుచ్చేరిలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. తాజాగా పుదుచ్చేరిలోని డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఎమ్మెల్యే ఆర్ శివకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.
ఒర్లీన్ పేట ఎమ్మెల్యే, డీఎంకే పార్టీ నేత అయిన శివకు కరోనా సోకడంతో.. ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కళాశాలలో చేరారు. ఆదివారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే శివను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి మార్చారు. పుదుచ్చేరిలో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది.