తెలంగాణలో కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి.;
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 373 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,091 కి చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 761కు చేరింది.
కాగా, కరోనా బారి నుంచి కోలుకుని ఒక్కరోజే 1,825 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 82,411 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 22,919 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక హోం, ఐసోలేషన్ కేంద్రాల్లో 16,482 మంది ఉన్నారు.