గోవాలో కొత్తగా 306 కరోనా పాజిటివ్ కేసులు
కరోనా విస్తరిస్తున్న తొలి రోజుల్లో కొవిడ్ రహిత రాష్ట్రంగా ఉన్న గోవాలో ఇప్పుడు పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిత్యం వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.;
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక కరోనా విస్తరిస్తున్న తొలి రోజుల్లో కొవిడ్ రహిత రాష్ట్రంగా ఉన్న గోవాలో ఇప్పుడు పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిత్యం వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గోవా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,790కి చేరింది. అందులో ఇప్పటికే 10,019 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 3,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 140కి చేరింది.