దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వరుస పేలుళ్లు.. 9మంది మృతి
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వరుసగా రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.;
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వరుసగా రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 9 మంది మృతి చెందినట్టు సైనికాధికారులు తెలిపారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సులు ప్రావిన్స్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి. సులు రాజధాని నగరమైన జోలోలోని ఓ కిరాణా దుకాణం ఎదుట నిలిపిన మిలటరీ ట్రక్ లక్ష్యంగా చేసుకొని మొదటి పేలుడు జరగగా.. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో గంట వ్యవధిలో మొదటి ప్రదేశానికి 70 మీటర్ల దూరంలోని క్యాథలిక్ చర్చిలో రెండో పేలుడు జరిగింది. ఇక్కడ మరో నలుగురు మృతి చెందారు. ఈ రెండుచోట్ల మొత్తం 17 మంది గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.