భారీ వ‌ర్షాలు.. ఒడిశా, ఛత్తీస్‌గడ్‌కు రెడ్ అలర్ట్‌

Update: 2020-08-26 01:48 GMT

తూర్పు, వాయువ్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్ర‌భావం ఉత్తర బెంగాల్ తీరం మీదుగా వచ్చే ఐదు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్ర‌భావం కార‌ణంగా ఆగ‌స్టు 28 వ‌ర‌కు ఒడిశా, గంగేటిక్ వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆగస్టు 26న ఒడిశాకు, ఆగస్టు 27న ఛత్తీస్‌గడ్‌కు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. అదేవిధంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ప‌శ్చిమ భాగంలో ఆగ‌స్టు 26 నుంచి 28 వ‌ర‌కు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగష్టు 25,26 తేదీలలో ఒడిశాపై అదేవిధంగా ఆగస్టు 27న ఛత్తీస్‌గడ్‌లో అతి భారీ వ‌ర్ష‌పాతం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అమ్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించింది. 

Tags:    

Similar News