సెప్టెంబర్ 14 నుంచి వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2020-08-25 14:07 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. అక్టోబర్ 1 వరకూ జరుగుతాయని అధికారులు తెలిపారు. ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. రెండు సభలను నడిపిస్తామని అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో లోకసభలో.. లోకసభ, రాజ్యసభలో రాజ్యసభలో సమావేశం అవుతారని తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులందరికీ 'ఆరోగ్య సేతు' యాప్ కచ్చితంగా ఉండాలని నిబంధన విధించారు. సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహణ, శానిటైజేషన్ చేస్తామని తెలిపారు. సభ్యులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని.. వారి వ్యక్తిగత సిబ్బందికి మాత్రం అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News