Drinker Sai Review : డ్రింకర్ సాయి మూవీ రివ్యూ

Update: 2024-12-28 14:15 GMT

రివ్యూ : డ్రింకర్ సాయి

తారాగణం : ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, కిర్రాక్ సీత, రీతు చౌదరి తదితరులు

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

మ్యూజిక్ : శ్రీ వసంత్

సినిమాటోగ్రఫీ : ప్రశాంత్ అంకిరెడ్డి

నిర్మాతలు : బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్

దర్శకత్వం : కిరణ్ తిరుమలశెట్టి

యూత్ ఫుల్ మూవీస్ లో కాస్త రా గా కనిపించే లవ్ స్టోరీస్ కు ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందించినట్టుగా ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న మూవీ ‘డ్రింకర్ సాయి’. ట్రైలర్ లో చూస్తే అమ్మాయిని వేధించే అబ్బాయే కనిపించాడు. అదేంటి అని అడిగితే అద్భుతమైన ఎమోషన్ తో పాటు మంచి సందేశం కూడా ఉందని చెప్పారు మేకర్స్. మరి వాళ్లు చెప్పినట్టుగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

సాయి(ధర్మ) అదే పనిగా తాగుతూ ఉంటాడు. అందుకు కారణం అతని పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతారు. చెప్పేవాళ్లు లేకపోవడంతో మందుకు బానిస అవుతాడు. జీవితం అంటే ఎంజాయ్ చేయడమే అనే కాన్సెప్ట్ తో ఫ్రెండ్స్ తో బలాదూర్ గా ఉంటాడు. ఓ రోజు అతన్ని బాగీ(ఐశర్య శర్మ) అనే అమ్మాయి బైక్ తో గుద్దేసి వెళ్లిపోతుంది. తనెవరో తెలుసుకుని ఆమెను నిలదీయాలని వెళతాడు. కానీ బాగీని చూడగానే సాయి ప్రేమలో పడిపోతాడు. మందు, సిగరెట్ అంటే అస

హ్యించుకునే బాగీ అతని పోరు పడలేక ప్రేమిస్తున్నా అని అబద్ధం చెబుతుంది. కానీ అతనో డ్రింకర్ అని తెలిసి దూరం పెడుతుంది. మరి ఆ విరహాన్ని సాయి తీసుకున్నాడు. ప్రేమను కోల్పోయిన సాయి లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అసలు ఈ ఇద్దరూ ఒక్కటవుతారా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనగానే ఆడియన్స్ మైండ్ లో ఏ తరహా కంటెంట్ మెదులుతుందో.. అలాగే రూపొందింది డ్రింకర్ సాయి. కాకపోతే ఇందులో లవ్ స్టోరీ కాస్త కొత్తగా కనిపిస్తుంది. ప్రేమిస్తున్నా అని నమ్మించే అమ్మాయి.. సిన్సియర్ గా ప్రేమించే అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య అతని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎడబాటు రావడం.. తర్వాత అతను తన ప్రేమలోని సిన్సియారిటీని చూపించే ప్రయత్నం చేయడం.. ఆక్రమంలో వచ్చే సన్నివేశాలు మేకర్స్ చెప్పినట్టుగానే హార్ట్ టచింగ్ సాగడం.. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాగుతూ కథనంలో ఎక్కడా ఫ్లో తగ్గకుండా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ అనిపించినా.. అసలు కథ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య చాలా సినిమాలు ప్రీ క్లైమాక్స్ నుంచి ఆడియన్స్ ను కట్టి పడేస్తున్నాయి. ఇదీ ఆ కోవలోనే వస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఆ టైమ్ లోనే చెప్పాడు. ఈ ఇద్దరూ కలుస్తారా లేదా అనే క్యూరియాసిటీని మెయిన్టేన్ చేయడంలోనూ అతను సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా చిన్న డ్రా బ్యాక్స్ ఉన్నా.. ఇది పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

నటన పరంగా చూస్తే డ్రింకర్ సాయిగా ఆ పాత్రలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు హీరో ధర్మ. నిజానికి తాగుబోతు పాత్రలు అందరికీ పండవు. చాలా ఎక్స్ పీరియన్స్ కావాలంటారు. అలా చూస్తే ధర్మ చాలా వరకూ బెటర్ అనిపించుకున్నాడు. డిఫరెంట్ వేరియేషన్స్ ను కూడా బానే పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్యశర్మ క్యూట్ లుక్స్ తో బావుంది. నటనతోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో రీతూ వర్మ, భద్రం, సమీర్ పాత్రల మేరకు బాగా నటించారు.

టెక్నికల్ గానూ డ్రింకర్ సాయి బెటర్ క్వాలిటీతో కనిపించాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్ పరంగా నేపథ్య సంగీతంతో పాటు పాటలూ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బావుంది. మాటలు ఆకట్టుకున్నాయి. దర్శకుడుగా కిరణ్ తిరుమలశెట్టి ఎంచుకున్న కథను వంద శాతం న్యాయం చేసే ప్రయత్నంలో ది బెస్ట్ వర్క్ ఇచ్చాడు అనే చెప్పాలి.

ఫైనల్ గా : డ్రింకర్ సాయి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 3/5

Tags:    

Similar News