Dhoolpet Police Station Review : ధూల్ పేట పోలీస్ స్టేషన్ మూవీ రివ్యూ

Update: 2026-01-19 10:58 GMT

రివ్యూ : ధూల్ పేట పోలీస్ స్టేషన్

ఆర్టిస్ట్స్ : అశ్విన్ కుమార్, శ్రీతు కృష్ణన్, గురు, పదినే తదితరులు

ఎడిటర్ : శామ్ ఆర్.డి.ఎక్స్

సంగీతం : అశ్వత్ నాగనాథమ్

సినిమాటోగ్రఫీ : సతీష్ కుమార్

దర్శకత్వం : జశ్విని

ధూల్ పేట పోలీస్ స్టేషన్.. ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ 5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో డిఫరెంట్ కోణంలో కనిపించే మూవీ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీల్ అవడం ఖాయంగా ఉంటుంది. ఇది 20 ఎపిసోడ్స్ తో ఉండే థ్రిల్లర్. అయితే ప్రతి ఫ్రైడే ఒక ఎపిసోడ్ విడుదలవుతుంది. అన్నీ కలిపి 20 ఎపిసోడ్స్. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

ధూల్ పేట అనే ఊరికి వెట్రి మారన్(అశ్విన్ కుమార్) పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్ అయి వస్తాడు. అతను నిజాయితీ పరుడు. అయితే అదే ఊరికి చెందిన మరో లేడీ పోలీస్ మాసాని ( పదినే కుమార్) ఉంటుంది. అయితే ఆమె దైవ భక్తి ఉంటుంది. అమ్మవారికి అపర భక్తురాలు. అలాంటి తనకు ఆ ఊరిలో ఒక ముగ్గురు ముందే చనిపోతారు అని తెలిసి ఉంటుంది. పైగా అవన్నీ హత్యలే అని తెలియజేస్తుంది. ఈ విషయం డిపార్ట్ మెంట్ కు తెలియడంతో అంతా అలెర్ట్ అవుతారు. మరి ఆ ముగ్గురు ఎవరు..? ఎలా చనిపోతారు..? అందుకు కారణాలేంటీ..? కొత్తగా వచ్చిన పోలీస్ వెట్రిమారన్ దీన్ని ఛేదించాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

ధూల్ పేట పోలీస్ స్టేషన్.. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ ఊరికి సంబంధించిన అనేక అంశాలు ఈ కథలో కనిపిస్తాయి. ప్రధానంగా ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయినా కేవలం ఇన్వెస్టిగేషన్ పై మాత్రమే కాకుండా గ్రామ రాజకీయాలు, పగలు కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ గా ఆ గ్రామ రాజకీయాలకు ఆ పోలీస్ స్టేషన్ కు ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటాడు దర్శకుడు. రాజకీయాలు, పగలు వీటి చుట్టూ ఉండే మూడు హత్యలు.. వాటిని ఛేదించే పోలీస్ లు.. ఈ క్రమంలో వచ్చే అనేక సన్నివేశాలు ఇవన్నీ కూడా మొత్తం సిరీస్ ను మెప్పించేలా ఉంది.

ఈ తరహా సిరీస్ లో మూడు హత్యలు అంటే మూడు ఎపిసోడ్స్ తీసుకుంటారు. బట్ వీళ్లు ఒకే ఎపిసోడ్ లో మూడు హత్యలు జరగడం చూపించడంతో ఫస్ట్ నుంచి వెరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ క్రమంలో ఐదు ఎపిసోడ్స్ లో కథేంటీ అనేది తెలియజేస్తారు. తర్వాత ఎపిసోడ్స్ లో ఆ కథలోని తతంగం మాత్రం కనిపిస్తుంది. అలాగని ఎక్కడా బోర్ కొట్టని విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఉండే స్క్రీన్ ప్లే బాగా ఆకట్టుకుంటుంది. 20 ఎపిసోడ్స్ ఉన్నా.. ఎక్కడా బోర్ కొట్టని విధంగా రూపొందించాడు దర్శకుడు. అయితే 20 ఎపిసోడ్స్ లో కేవలం ఒకే హత్య గురించి ఛేదించడం తర్వాతి హత్యల గురించి సీక్వెల్స్ ఉంటాయని చెప్పడం కాస్త అతిగా కనిపిస్తుంది. అలాగని బోర్ కొట్టదు. కాకపోతే మిగతా ఎపిసోడ్స్ లో కూడా ఈ తరహాలో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. అప్పుడు మరింతగా థ్రిల్ కలుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నచ్చే వారికి మరింతగా బాగా ఆకట్టుకుంటుంది.

నటన పరంగా ప్రతి ఒక్కరూ బాగా చేశారు. పోలీస్ ఆఫీసర్ గా అశ్విని కుమార్, అలాగే అమ్మవారి భక్తురాలుగా, పోలీస్ గా పదినే కుమార్ నటన హైలెట్ గా నిలిచింది.

టెక్నికల్ గా చాలా బావుంది. అశ్వత్ మ్యూజిక్ సిరీస్ రేంజ్ ను పెంచుతుంది. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

ఫైనల్ గా : ధూల్ పేట పోలీస్ స్టేషన్.. అదిరింది

రేటింగ్ : 2.75/5

Tags:    

Similar News