పాపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. పసిఫిక్ దీవుల సహకార సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అంతకు ముందు జపాన్ పర్యటనలో ప్రధాని బిజీ..బిజీగా గడిపారు.G7 సమావేశంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని క్వాడ్‌లీడర్లతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశం అయ్యారు మోదీ. ఈ నేపధ్యం లో ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు.
అంతకుముందు హిరోషిమా పీస్ మెమోరియల్ వద్ద అటామ్ బాంబ్ దాడిలో మరణించిన వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఆ తర్వాత పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని కూడా సందర్శించారు. G7 సమావేశంతో పాటు వివిధ కార్యక్రమాలతో మోదీ బిజీగా గడిపారు.సమావేశాలకు వచ్చిన వివిధ దేశాల అధినేతలో సమావేశం అయ్యారు.