ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇద్దరు నిందితులకు బెయిల్
ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని తెలిపిన న్యాయమూర్తి;
ఢిల్లి లిక్కర్ స్కామ్‌లో ఇద్దరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలపై వచ్చిన అభియోగాల్లో మనీ లాండరింగ్ సంబంధించిన మెటీరియల్ ఆధారాలు లేవని ప్రత్యేక జడ్జి నాగపాల్ కామెంట్ చేశారు. ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని న్యాయమూర్తి తెలిపారు. రాజేష్ జోషి 30 కోట్ల మేర క్విక్ బ్యాక్ కు పాల్పడ్డాడన్న ఈడీ అభియోగాలు మోపింది. అలాగే గౌతమ్ మల్హోత్రా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి మనీ లాండరింగ్ చేశారని ఈడీ ఆభియోగం మోపింది అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది.