Tamil Nadu: తమిళనాడులో ఒకేసారి 11 ప్రభుత్వ కళాశాలల ప్రారంభోత్సవం..

Tamil Nadu: తమిళనాడులో ప్రధాని మోదీ ఇవాళ 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు.;

Update: 2022-01-12 04:00 GMT

Tamil Nadu: తమిళనాడులో ప్రధాని మోదీ ఇవాళ 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను, చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు సంబంధించిన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 4వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త వైద్య కళాశాలలు స్థాపిస్తున్నారు. ఇందు కోసం దాదాపు

2వేల 145 కోట్ల రూపాయలు కేంద్రం అందించగా మిగిలింది తమిళనాడు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విరుదునగర్, నామక్కల్, ది నీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో వైద్య విద్యను ప్రోత్సహించడానికి, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం ఈ వైద్య కళాశాలల స్థాపన చేస్తోంది. 

Tags:    

Similar News