Tiranga Rally: జ‌మ్మూక‌శ్మీర్‌లో 1508 మీట‌ర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ

వెల్క‌మ్ దోడా ఎంట్రీ గేటు నుంచి క‌మ్యూనిటీ హాల్ వ‌ర‌కు ర్యాలీ;

Update: 2025-08-12 05:15 GMT

జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమ‌వారం విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో సుమారు 1508 మీట‌ర్ల పొడవైన జాతీయ ప‌తాకాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. దోడా జిల్లా డిప్యూటీ క‌మీష‌న‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ నేతృత్వంలో ఈ మెగా తిరంగా ర్యాలీ జ‌రిగింది. వెల్క‌మ్ దోడా ఎంట్రీ గేటు నుంచి క‌మ్యూనిటీ హాల్ వ‌ర‌కు భారీ త్రివ‌ర్ణ ప‌తాకంతో ఈ తిరంగా ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు త‌మ దేశ‌భ‌క్తిని చాటుకుంటూ దేశ‌భ‌క్తి గీతాలను ఆలపిస్తూ, నినాదాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ఈ తిరంగా ర్యాలీ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

Tags:    

Similar News