Monkeypox In India: ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు.. ఇండియాలో నాలుగుకు చేరిన సంఖ్య..

Monkeypox In India: కరోనా మహమ్మారి ఇంకా కనుమరగు కాకముందే మంకీపాక్స్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.

Update: 2022-07-24 13:10 GMT

Monkeypox In India: కరోనా మహమ్మారి ఇంకా కనుమరగు కాకముందే మంకీపాక్స్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇక మనదేశంలోనూ మంకీపాక్స్‌ గుబులురేపుతుంది.. ఇప్పటికే మన దేశంలో మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదైంది..దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్‌ కేసు నమోదైంది.దీంతో మరోసారి మంకీపాక్స్‌ కలవరం మొదలైంది.. అయితే పాక్స్‌ సోకిన వ్యక్తికి ఎలాంటి ఫారిన్‌ ట్రావెల్‌ హిస్టరీ లేకపోవడంతో స్థానికంగానే సోకిందని అంటున్నారు.

మంకీపాక్స్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని వైద్యులు నిర్ధారించారు..తుంపర్లు లేదా వ్యాధి పోకిన వ్యక్తికి దగ్గర ఉండటం వల్ల వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది.మంకీపాక్స్‌ సోకిన వారిలో జర్వం,తలనొప్పి,వాపు, నడుంనొప్పి కలండరాల నొప్పి అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు వైరస్‌ లక్షణాలు బయటపడేందుకు ఆరు నుంచి పదమూడు రోజులు పడుతుంది.

మరోవైపు ఒక దేశం నుంచి మరో దేశానికి మంకీపాక్స్‌ పాకుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది..వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. W.H.O.సాదారణంగా ఒక వ్యాధి ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనకరంగా మారితే అప్పుడు హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు..

ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్‌ కలకలం రేపుతున్న నేపధ్యంలో అయాదేశాలు మంకీపాక్స్‌ పై పోరాడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పదహారు ల్యాబొరేటరీలు మంకీపాక్స్‌ కేసులను నిర్ధారించే పనిలో ఉన్నాయి. ఒక్క కేరళలోనే రెండు ల్యాబ్‌లు ఉన్నాయి..ప్రపంచ వ్యాప్తంగా డెబ్బైఐదు దేశాల్లో మంకీపాక్స్‌ కలకలం రేపుతోంది..

అయితే మంకీపాక్స్‌ అంత ప్రమాదకరమేమికాదని అంటున్నరు వైద్య నిపుణులు.ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధి నిర్ధారణ అయిన రోగిని నాలుగు వారాల పాటు ఐసోలేషన్‌ లో ఉంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు వర్షాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధుల లక్షణాలే పాక్స్‌ సోకిన రోగికి ఉంటాయని అంటున్నారు నిపుణులు మెడబాగం,చంకలు,గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం.

చిన్నపిల్లలు, రోగనిరోదకశక్తి తక్కువగా ఉన్నవారు గర్భిణి స్త్రీలు జాగ్రత్త ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. వైరస్‌ సోకితే నాలుగురోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి, పీపీఈ కిట్లు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.

Tags:    

Similar News