భారీ వర్షం.. గూగుల్ మ్యాప్ చూస్తూ కారు డ్రైవింగ్.. నదిలో మునిగి ఇద్దరు డాక్టర్లు..

ఆదివారం తెల్లవారుజామున కేరళలోని కొచ్చిలోని పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మృతి చెందారు.;

Update: 2023-10-02 06:35 GMT

ఆదివారం తెల్లవారుజామున కేరళలోని కొచ్చిలోని పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న అద్వైత్ (29), అజ్మల్ (29) అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందారు. వారు కొడంగల్లూర్‌కు తిరిగి వస్తున్నారు. రూట్ ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు నివేదించబడింది. రహదారి అని భావించి నీరు నిండిన నదిలోకి కారుని పోనిచ్చారు. దాంతో కారు నదిలో మునిగిపోయింది. అద్వైత్, అజ్మల్ ఇద్దరూ కారులో నుంచి బయటకు రాలేక పోయారు. దాంతో వారు మరణించారు. మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని రక్షించారు. భారీ వర్షం కారణంగా రహదారి సరిగా కనిపించలేదు. వారు గూగుల్ మ్యాప్ చూపిన రూట్‌లో వెళుతున్నారు. అయితే మ్యాప్‌లు సూచించిన విధంగా ఎడమవైపు మలుపు తీసుకోకుండా పొరపాటున ముందుకు వెళ్లి నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News