West Bengal: మంత్రి అనుచరుడి ఇంట్లో సోదాలు.. రూ.20 కోట్లు స్వాధీనం..
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న 20 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది;
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న 20 కోట్ల రూపాయల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈ మొత్తం లభించింది. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లు అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నేరాన్ని నిరూపించేందుకు ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశి కరెన్సీ, భారీగా నగదు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల దగ్గర లభించాయన్నారు. పార్థా చటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న టైంలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.