Mumbai Murder: బాయ్‌ఫ్రెండ్ స్నేహితురాలిని షూట్ చేసిన మరో మహిళ
ట్రయాంగిల్ లవ్‌లో దారుణం
రేపే ప్రేమికుల రోజు. ప్రేమకు గుర్తుగా లవర్స్ శుభాకాంక్షలు.. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలాంటి శుభ తరుణంలో ఘోరం జరిగిపోయింది. ట్రయాంగిల్ లవ్ కారణంగా పట్టపగలే అత్యంత దారుణంగా యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
షిఫా షేక్(19), 25 ఏళ్ల మరో మహిళ.. 23 ఏళ్ల యువకుడిని ప్రేమించారు. ఈ క్రమంలో ముగ్గురు మధ్య పొసగక పోవడంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షిఫా షేక్ అడ్డు తొలగించుకోవాలని జంట కుట్ర పన్నింది. ఇందులో భాగంగా శివాజీ నగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మాట్లాడాలంటూ షిఫా షేక్‌ను ఫోన్ చేసి రప్పించారు. మాట్లాడుతున్న సమయంలోనే ముఖంపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి తుపాకీ గురి పెట్టి కాల్చి చంపేశారు. పట్టపగలే యువతి రక్తపుమడుగులో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గాయపడిన యువతిని ఘట్కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 12 గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాలను జల్లెడ పట్టి హంతక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు.
ఘటన ప్రదేశం నుంచి సేకరించిన ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.