Odisha: ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి..
Odisha: ఒడిశాలోని నౌపాద జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.;
Odisha: ఒడిశాలోని నౌపాద జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రత కోసం వెళ్లిన సీఆర్‌పీఎఫ్ బృందంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐలు, కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ కాల్పులతో ఒక్కసారి భద్రతా యంత్రాంగం ఉలిక్కిపడింది. మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.