Boat Capsize: అమెరికాలో బోటు మునక..
ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్;
అమెరికాలోని శాన్ డియాగో సిటీకి సమీపంలో ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీరం వద్ద శరణార్థులు బోటు బోల్తా ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడు మంది గల్లంతు అయ్యారు. అయితే ఆచూకీ లేనివారిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు 15 మైళ్ల దూరంలో 16 మందితో వెళ్తున్న బోటు బెల్తాపడినట్లు తెలిసింది.
శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బోటు మునక ఘటనపై స్పందించారు. ఈ విషాద ఘటనలో భారతీయ కుటుంబం ఉన్నట్లు చెప్పారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరు పిల్లలు గల్లంతు అయినట్లు గుర్తించారు. అయితే వారి పేరెంట్స్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్థానిక అధికారుల సాయంతో భారతీయ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు కాన్సులేట్ పేర్కొన్నది. బోటులో అక్రమంగా మనుషుల్ని తరలిస్తున్నట్లు గుర్తించామని కోర్టు గార్డు అధికారులు చెప్పారు.