జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు, ఒక ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) ఉన్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. వాపి-సూరత్ స్టేషన్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడిని ముంబై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, “రైలు నెం. 12956లో 31.7.23న 5.23 గంటలకు B5 కోచ్‌లో కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న CT చేతన్, ఎస్కార్ట్ ఇంచార్జి ASI టికా రామ్‌పై కాల్పులు జరిపినట్లు ధృవీకరించబడింది.