Rajasthan: రెండు రోజులపైనా శ్రమించినా దక్కని ఫలితం‌..బోరుబావిలో పడి బాలుడి మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బోరు బావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు..;

Update: 2024-12-12 02:30 GMT

ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన రెస్య్కూ ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. అయితే, అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని హస్పటల్ కి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన వైద్యులు బాలుడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌస జిల్లాలో జరిగింది.

ఇక, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని కాలిఖండ్ అనే గ్రామంలో సోమవారం నాడు ఐదేళ్ల బాలుడు ఆర్యన్‌ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. ఆ బాలుడి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు, జేసీబీలు, డ్రిల్లింగ్‌ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో కంటిన్యూగా మట్టి తవ్వుతుంటే.. మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆ బాలుడికి ఆక్సిజన్‌ పంపించారు.

అయితే, ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు 160 అడుగుల వరకు నీటి మట్టం ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అంచనా వేసింది. భూమి లోపల ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అధికారులు అంచనా వేశారు. అయినా కూడా, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్‌ సేఫ్ గా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను హస్పటల్ కి తరలించినప్పటికి.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News