తీవ్రమైన వేడిగాలులు.. స్పృహ తప్పి పడిపోయిన 50 మంది విద్యార్థులు..

Update: 2024-05-29 10:54 GMT

బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని అరియారీ బ్లాక్‌లోని మన్‌కౌల్ మిడిల్ స్కూల్‌లో బుధవారం ఉదయం 50 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు . జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ప్రారంభంలో, ఆరుగురు విద్యార్థులు స్పృహ కోల్పోయారు, కానీ తరువాత, చాలా మంది విద్యార్థులు కుప్పకూలడం ప్రారంభించారు. విద్యార్థులు ప్రార్థనల కోసం అసెంబ్లీకి హాజరై, ఆపై తరగతికి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనతో పాఠశాల, గ్రామంలో గందరగోళం నెలకొంది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థులకు నీరు, ఎలక్ట్రోలైట్‌లు అందించి అంబులెన్స్ రాకపోవడంతో వెంటనే బైక్‌లు, టెంపోలు, ఈ-రిక్షాలపై జిల్లా సదర్‌ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ సంఘటన గురించి ప్రజారోగ్య విభాగానికి వెంటనే సమాచారం అందించి అంబులెన్స్‌ను అభ్యర్థించారు.

అయితే అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి పరిపాలనపై నిరసన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ వివరిస్తూ.. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అసెంబ్లీకి హాజరైన తర్వాత తరగతిలో స్పృహ తప్పి పడిపోయారు. వారికి నీళ్లు, ఎలక్ట్రోలైట్‌లు అందించి అంబులెన్స్‌కు ఫోన్ చేశాం.. అది రాకపోవడంతో ప్రైవేట్‌ వాహనాల్లో తీసుకెళ్లాం అని తెలిపారు. 

Tags:    

Similar News