GOA: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
నిప్పుల గుండం తొక్కుతుండగా తోపులాట..;
గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆలయంలో జాతర జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఉదయం నిప్పుల గుండం తొక్కే తంతు మొదలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తు రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా మంది భక్తులు గాయాలపాలయినట్టు తెలుస్తుంది. ఇక స్థానిక భక్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.