Maoists: లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు

‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగుబాటు

Update: 2025-09-24 23:45 GMT

 కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.

మావోయిస్టు భావజాలంతో నిరాశ చెందామని పేర్కొంటూ 21 మంది మహిళలతో సహా పలువురు మావోయిస్టులు సీనియర్ పోలీస్ అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయినట్లు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. బస్తర్ రేంజ్ పోలీసులు ప్రారంభించిన ‘లోన్ వరరతు’, ‘పూనా మార్గెమ్’ పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లొంగుబాటు, పునరావాస విధానాలు తమను ఆకట్టుకున్నాయని లొంగిపోయిన వారు చెప్పారు.

లొంగిపోయిన వారిలో బామన్ మడ్కం (30), మంకి అలియాస్ సమిలా మాండవి (20)తలలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. షమిలా అలియాస్ సోమ్లి కవాసి (25), గంగి అలియాస్ రోహ్ని బార్సే (25), దేవే అలియాస్ కవితా మాందవి (25), సంతోష్ మాండవి (30)లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. 2020లో ప్రారంభించిన ‘‘లోన్ వర్రాటు(స్థానిక గోండి భాషలో ఇంటికి తిరిగి రండి అని అర్థం) కింద 1113 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఒక్కొక్కరికి రూ. 50,000 సహాయం అందించారు.

Tags:    

Similar News