Mobile Connections Cancelled : 73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు: కేంద్రం
రీవెరిఫికేషన్‌లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ LSలో తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెలికం విభాగం(డాట్) టెల్కోలను ఆదేశించింది. వివరాల ధ్రువీకరణలో విఫలమైన కంపెనీలు, కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ IDలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించింది. నకిలీ ధ్రువీకరణలతో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడంపై మంత్రి స్పందిస్తూ.. 16 లక్షల మంది చందాదార్లు, వివిధ ఆపరేటర్ల నుంచి పరిమితికి మించి 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్లను పొందారని తెలిపారు. డాట్ ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించగా సుమారు 66 లక్షల మొబైల్ కనెక్షన్లను ఆయా సంస్థలు తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు.