ముంబైలోని ఎల్‌టీటీ స్టేషన్‌లో అగ్నిప్రమాదం
ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషన్‌లోని క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి.;
ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషన్‌లోని క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. జాతీయ వార్తా సంస్థల నివేదిక ప్రకారం ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లోని క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఒకటి. మంటలు చాలా విపరీతంగా ఉండటంతో క్యాంటీన్ రెస్ట్ రూమ్ కి వ్యాపించింది.