Ankita Nagar: కూరగాయలు అమ్ముతూ జీవించే కుటుంబం.. కూతురిని సివిల్ జడ్జిని చేసింది..

Ankita Nagar: ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత మూడేళ్ల నుండి సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవుతోంది.

Update: 2022-05-06 05:30 GMT

Ankita Nagar: రోజుకు ఒంటిపూట భోజనం చేసే మధ్య తరగతి కుటుంబం కూడా తమ పిల్లలను మంచి స్కూలులోనే చదివించాలి అనుకుంటుంది. తమకు కనీస సదుపాయాలు లేకపోయినా కూడా వారి పిల్లలు చదువుకోవడానికి మాత్రం ఏ ఆటంకం కలగకూడదు అనుకుంటుంది. అలాంటి కుటుంబాలు పేరు నిలబెట్టిన పిల్లలు కూడా లేకపోలేదు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అంకిత కూడా ఈ జాబితాలోకే చేరుతుంది.

ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత మూడేళ్ల నుండి సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవుతోంది. అంకిత తల్లిదండ్రులు ఇండోర్ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తన సోదరుడు రోజూవారి కూలీగా పనిచేస్తు్న్నాడు. కానీ అంకితకు చదువంటే ఇష్టం ఉండడంతో అప్పులు చేసి మరీ కాలేజీ ఫీజులు కట్టి తన తల్లిదండ్రులు ఎల్‌ఎల్‌బీ చదివించారు.

2017లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అంకిత.. 2021లో ఎల్‌ఎల్‌ఎమ్ సర్టిఫికెట్ సాధించింది. ఆ క్రమంలోనే తాను సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవ్వడం మొదలుపెట్టింది. మూడేళ్లు కష్టపడిన తర్వాత తనకు ఆ పరీక్షల్లో ఐదవ ర్యాంకు దక్కింది. దీంతో అంకిత కుటుంబం తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందంటూ సంతోషంలో ఉన్నారు.



Tags:    

Similar News