Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు ముందు భారీ కుట్ర!

Update: 2025-04-23 09:00 GMT

ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టూరిస్ట్ సీజన్ కావడం, జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సమయంలో ఈ కుట్రకు పాల్పడ్డారు. పహల్‌గామ్ సమీపంలోని బైసరీన్ వ్యాలీలో పెద్దఎత్తున టూరిస్టులు ఉండగా అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేదు. గుర్రాలపైనే వెళ్లాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి అమిత్ షా హుటాహుటిన అక్కడికి బయల్దేరారు.

పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని కరాచి నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని Xలో పోస్టుల వైరలవుతున్నాయి. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. వీటిలో మిలిటరీ సామగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సరిహద్దు జమ్ముాకశ్మీర్‌కు సమీపాన ఉంటుంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

Tags:    

Similar News