అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ సందేశం

అన్ని వయసుల మహిళలు తమ ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని అని నీతా అంబానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పిలుపునిచ్చారు.;

Update: 2025-03-08 11:46 GMT

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ మహిళలు ఆరోగ్యం మరియు స్వీయ సంరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వమని సందేశం ఇచ్చారు. 61 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ పోషకాహారంతో కూడిన సమతుల్య జీవనశైలి యొక్క ప్రాముఖ్యతను ఆమె తెలియజేశారు. 

క్రమశిక్షణతో జీవితాన్ని రూపుదిద్దుకోవాలని నీతా మహిళలకు తెలిపారు. ఆరేళ్ల వయస్సు నుండి భరతనాట్యం అభ్యసించిన ఆమె విభిన్న కార్యకలాపాలను నిర్వహించడానికి తోడ్పడింది. 

వ్యాయామం తన రోజువారీ దినచర్యలో భాగమని తెలిపారు. ఆమె వారపు నియమావళిలో లెగ్ డే వ్యాయామాలు, కోర్ వ్యాయామాలు మరియు యోగా ఉంటాయి. ఆమె తన దినచర్యను డైనమిక్‌గా ఉంచడానికి ఈత, ఆక్వా వ్యాయామాలు మరియు నృత్య సెషన్‌లను కూడా చేర్చుకుంటుంది. ఆమె ప్రతిరోజూ 5,000–7,000 అడుగులు నడవడం ద్వారా ప్రయాణించేటప్పుడు చురుకుగా ఉంటుందని తెలిపింది.

వ్యాయామం జీవితాన్ని సమతుల్యం చేసేందుకు తోడ్పడుతుంది. ఆలోచనా విధానం సరిగ్గా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లడానికి తోడ్పడుతుంది అని తెలిపింది. 

Tags:    

Similar News